
ఓటీటీ (OTT )లో వారవారం కొత్త కంటెంట్ ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంటుంది. అందులో డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు కొన్నైతే.. థియేట్రికల్ రన్ ముగుంచుకుని ఓటీటీలోకి వస్తున్న సినిమాలు కొన్ని. మరి సంక్రాంతి పండుగ వస్తోంది..అందరు థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూడలంటే..వెళ్లే తీరిక ఉండదు. ఇంకొంత మందికి అయితే ఇంకో 20 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తోందిలే అని ఎదురు చూస్తుంటారు. మరి ఈ సంక్రాంతి పండక్కి ఏ సినిమాలు వస్తున్నాయో..చూసేద్దాం.
ఆహా:
కోట బొమ్మాళి పీఎస్:
హీరో శ్రీకాంత్ (Srikanth) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్ (Kota Bommali PS).ఈ సినిమా విడుదలకు ముందే ‘లింగి లింగి లింగిడి’ అనే సాంగ్తో సోషల్ మీడియాలో సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఈ పాటకు ప్రతి ప్రేక్షకుడు థియేటర్లోనూ..ఫంక్షన్స్ లోను స్టెప్పులేశారు. దీంతో ఈ సినిమా థియేటర్లో రిలీజై గ్రాండ్ సక్సెస్ అయింది.ఇవాళ జనవరి 11న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేరకు..రాజకీయ క్రీడలో పావులుగా పోలీసులు! ఎరగా మిగిలిపోతారా,ఎదిరించి పోరాడతారా..అని ఆహా ట్వీట్ చేసింది.
లింగోచ్చా:
కార్తీక్ రత్నం హీరోగా ఆనంద్ బడాని దర్శకత్వంలో యాదగిరి రాజు నిర్మించిన చిత్రం లింగోచ్చా.కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు యువ నటుడు కార్తీక్ రత్నం. అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజైన లింగొచ్చా యావరేజ్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
జీ5:
అజయ్ గాడు (తెలుగు సినిమా) – జనవరి 12
నెట్‌ఫ్లిక్స్:
ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ (తెలుగు మూవీ) – జనవరి 12
అడిరే (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 12
లిఫ్ట్ (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 12
లవ్ ఈజ్ బ్లైండ్: స్వీడన్ (స్వీడిష్ సిరీస్) – జనవరి 12
డంబ్ మనీ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 13
అమెజాన్ ప్రైమ్:
మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) – జనవరి 11
రోల్ ప్లే (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 12
హాట్‌స్టార్:
ఎకో (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 11
ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జనవరి 12
సోనీ లివ్:
చేరన్స్ జర్నీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జనవరి 12
జియో సినిమా లా బ్రియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 10
టెడ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 12
ఆపిల్ ప్లస్ టీవీ క్రిమినల్ రికార్డ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 10
బుక్ మై షో..
జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆన్ ఇన్ఫైనిట్ ఎర్త్ (ఇంగ్లీష్ సినిమా) –జనవరి 09
వన్ మోర్ షాట్ (ఇంగ్లీష్ మూవీ) –జనవరి 09