బహుశా నేను అంత ఫేమస్ కాదేమో.. ప్రేమ కథలపై మృణాల్ కామెంట్స్

బహుశా నేను అంత ఫేమస్ కాదేమో.. ప్రేమ కథలపై మృణాల్ కామెంట్స్

సీతరామమ్(Sita Ramam) సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచేసుకుంది. ఇక సీతరామమ్ భారీ సక్సెస్ తో వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంది. వాటిలో నాని(Nani) తో చేసిన హాయ్ నాన్న(Hi Nanna), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో చేస్తున్న ఫ్యామిలీ స్టార్(Family Star) సినిమాలు ఉన్నాయి. అయితే తెలుగులో మృణాల్ చేసిన సినిమాలన్నీ లవ్ అండ్ ఎమోషనల్ సినిమాలే కావడం విశేషం. ఈ సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. విమర్శకుల నుండి ప్రశంసలు కూడా దక్కాయి. 

అయితే.. బాలీవుడ్ మాత్రం ఆమెకు గ్లామర్ రోల్స్ మాత్రమే దక్కుతున్నాయి. ఇదే విషయం తాజాగా స్పందించింది మృణాల్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. నేను బాలీవుడ్ లో అంత ఫేమస్ కాదేమో. అందుకే ప్రేమ కథల సినిమాలు నా వరకు రావడంలేదు. బాలీవుడ్ లో కూడా మంచి లవ్ అండ్ ఎమోషనల్ కథలు రావాలని నేను కోరుకుంటున్నాను. వాటి గురించి ఎవర్ని అప్రోచ్ అవ్వాలో నాకు తెలియదు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా నా మనసులో మాటను బయటపెడుతున్నను. ఈ వీడియో వైరల్ అవుతుందని భావిస్తున్నాను.. అంటూ చెప్పుకొచ్చారు మృణాల్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక మృణాల్ ఠాకూర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె రౌడీ హీరో విజయ్ దేవరకొండ జంటగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమాలో నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి ఈ రెండు సినిమాలు మృణాల్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తున్నారు అనేది చూడాలి.