అతడంటే నాకెంతో ఇష్టం: హీరోయిన్ మృణాల్ ఠాకూర్

అతడంటే నాకెంతో ఇష్టం: హీరోయిన్ మృణాల్ ఠాకూర్

సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). ఇందులో ఓ వైపు సీతగా, మరోవైపు ప్రిన్సెస్‌‌ నూర్జహాన్‌‌గా తన నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. ప్రస్తుతం మృణాల్ తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారింది.

లేటెస్ట్ తన హిందీ ప్రాజెక్ట్‌ ఆంఖ్‌ మించొలీ (Aankh Micholi) ప్రమోషన్స్‌ లో పర్సనల్ లైఫ్ గురుంచి మాట్లాడుతూ..తన మ్యారేజ్ విషయంలో కుటుంబం నుంచి ఒత్తిడి ఉందని తెలిపింది. తొందరగా మ్యారేజ్ చేసుకోమని చెబుతూనే..పెళ్లి కొడుకు వేటలో ఫ్యామిలీ మొత్తం ఉన్నట్లు పేర్కొంది.

ప్రసెంట్ సినిమాలు చేస్తూ..మరింత మంచి స్థాయికి వెళ్లాలని..ఇప్పట్లో మ్యారేజ్ చేసుకునే ఆలోచన లేదంటూ వివరించింది.కెనడియన్‌ యాక్టర్, మ్యూజిషన్ కీను రీవ్స్‌(Keanu Reeves) అంటే ఎంతో ఇష్టమని.. ఒకవేళ అతడి లాంటి వ్యక్తి తారసపడితే తప్పకుండ మ్యారేజ్ చేసుకుంటానని తెలిపింది. 

ALSO READ: హాయ్ నాన్న టీజర్ అప్డేట్ వచ్చేసింది..ఎప్పుడంటే ?
 

ప్రస్తుతం మృణాల్..హీరో నాని తో హాయ్ నాన్న మూవీలో నటిస్తోంది. ఈ మూవీలో నానికి పర్ఫెక్ట్ జోడీగా కనిపిస్తోందని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇటీవల హాయ్ నాన్న నుండి రిలీజైన సమయమా అనే సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. హేషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన మెలోడియస్ సాంగ్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. చాలా మంది ఫేవరేట్ లిస్టులోకి చేరిపోయింది ఈ పాట. అలాగే  గీత గోవిందం(Getha Govindam) ఫేం పరశురాం(Parashuram) డైరెక్షన్ లో విజయ్​ దేవరకొండ(Vijay devarakonda)తో ఓ సినిమాలో నటిస్తోంది.