IPL 2027: ఎల్లో ఆర్మీ అభిమానులకు ఇది నిజంగా ఓ బిగ్ సస్పెన్స్ థ్రిల్లర్.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మైదానంలోకి అడుగు పెట్టాలన్నా, వచ్చే సీజన్ వేలానికి వ్యూహాలు రచించాలన్నా ఇప్పుడు ఒకే ఒక్కడి గ్రీన్ సిగ్నల్ కావాలి.. అతడే తలా మహేంద్రసింగ్ ధోనీ. హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకుంటారా లేక టీమ్ మెంటార్‌గా వ్యవహరిస్తారా అనే దానిపై ధోనీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గాయాలతో ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరమైన మహీ భాయ్, ఇకపై ఆటగాడిగా కనిపించడం కష్టమేనని.. డగౌట్ నుంచే మాస్టర్ ప్లాన్స్‌తో టీమ్‌ను నడిపించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్.. ఎల్లో ఆర్మీ లెక్కలివే:
దాదాపు 19 ఏళ్ల సుదీర్ఘ అనుబంధానికి స్వస్తి పలుకుతూ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సీఎస్‌కే నుంచి తప్పుకోవడం ఫ్రాంచైజీలో పెను మార్పులకి దారి తీసింది. ఫ్లెమింగ్-ధోనీ కాంబినేషన్ సీఎస్‌కేకి 5 ఐపీఎల్ టైటిళ్లను అందించి ఐకానిక్ జోడీగా నిలిచింది. కానీ వరుసగా మూడేళ్ల పాటు (2024-2026) ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమవ్వడం, గడిచిన సీజన్‌లో 8వ స్థానంతో సరిపెట్టుకోవడంతో చెన్నై మేనేజ్‌మెంట్ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఫ్లెమింగ్ నిష్క్రమణతో తమ చరిత్రలోనే తొలిసారి ఒక సరికొత్త ప్రధాన కోచ్‌ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆటగాడిగా గుడ్‌బై.. కొత్త రోల్‌లో రీ-ఎంట్రీ?:
ధోనీ చివరిసారిగా 2025 సీజన్‌లో ఆడాడు. ఆ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 196 పరుగులు (ఎల్‌ఎస్‌జీపై 11 బంతుల్లో 26 రన్స్ మెరుపులు సహా) సాధించడంతో పాటు 5 క్యాచ్‌లు, 5 స్టంపింగ్స్ చేశాడు. కానీ వయసు, గాయాల దృష్ట్యా ఎంఎస్ ధోనీ ఇక ప్లేయర్‌గా కంటిన్యూ చేయడం కష్టమేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ధోనీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే హెడ్ కోచ్ లేదా మెంటార్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని, ఆ వెంటనే సీఎస్‌కే తమ కొత్త సీజన్ ప్రిపరేషన్స్ మొదలు పెడుతుందని చెన్నై ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి.
My dream of watching MS Dhoni play live in a stadium is officially over. 💔 pic.twitter.com/6a2n5xG8Nr
— ANUJx (@RealAnujX) August 29, 2026
