నవాబ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

నవాబ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ళ జంటగా రవి చరణ్ దర్శకత్వంలో హరిహర క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ఆర్ ఎమ్ నిర్మిస్తున్న చిత్రం ‘నవాబ్’. సోమవారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. రా అండ్ రస్టిక్ లుక్‌‌‌‌తో, ముందు డబ్బుల కట్టలు, వెనుక డంప్ యార్డ్, మధ్యలో రక్తపు మరకలతో ఇంటెన్సివ్‌‌‌‌గా సిగరెట్ తాగుతున్న హీరో పోస్టర్ మాసివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.

ఇదొక డంపింగ్ యార్డ్ చుట్టూ అల్లుకున్న కథ అని,  ఉత్కంఠ భరితమైన థ్రిల్లింగ్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ను అందిస్తుందని మేకర్స్ తెలియజేశారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోందని చెప్పారు.  మురళీ శర్మ,  దేవిప్రసాద్,  రాహుల్ దేవ్, సమ్మెట గాంధీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. పీఆర్ సంగీతం అందిస్తున్నాడు.