
విరాన్ ముత్తంశెట్టి, లావణ్య సాహుకార జంటగా వేణు మురళీధర్ దర్శకత్వంలో రాజశేఖర్, సాయి కృష్ణ నిర్మించిన చిత్రం ‘ముఖ్యగమనిక’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సక్సెస్ మీట్‌ను శనివారం నిర్వహించారు. దర్శకుడు వేణు మురళీధర్. వి. మాట్లాడుతూ ‘దర్శకుడిగా నాకిదే తొలిచిత్రం. ‘ఈగ’కు అసిస్టెంట్ కెమెరామెన్‌గా, ‘బాహుబలి’కి డీవోపీ సెంథిల్ దగ్గర చీఫ్ అసోసియేట్‌గా పనిచేశా. అలాగే పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశా. హీరో విరాన్ ఎంతో సహకరించారు. చాలా బాగా నటించారు.
కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది. సీడెడ్ లాంటి చోట్ల థియేటర్స్‌ను పెంచుతున్నాం’ అని చెప్పాడు. సినిమా విజయం పట్ల చాలా సంతోషంగా ఉన్నామని నటి ఆర్యన్ కృష్ణన్ చెప్పింది. ‘మంచి అప్లాజ్ వస్తోంది. విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’ అని నిర్మాతలు రాజశేఖర్, సాయి కృష్ణ అన్నారు. సంగీత దర్శకుడు కిరణ్ వెన్న, ఎడిటర్ శివ తదితరులు పాల్గొన్నారు.