పోర్న్ వీడియోల కేసులో యువ నటి అరెస్ట్

పోర్న్ వీడియోల కేసులో యువ నటి అరెస్ట్

సబ్‌‌స్క్రిప్షన్ పేరుతో వేల రూపాయల దోపిడీ
ముంబై: హిందీ యువ నటి గెహనా వశిష్ట్‌‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పోర్న్ వీడియోలు ఎరగా చూపిస్తూ యువత నుంచి డబ్బులు వసూలు చేస్తోందనే ఆరోపణలపై ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గెహనా పోర్న్ వీడియోలను షూట్ చేసి అనధికారికంగా వెబ్‌‌సైట్ల‌‌లో అప్‌‌లోడ్ చేయడంతోపాటు సబ్‌‌స్క్రిప్షన్ పేరుతో రూ.2 వేల చార్జ్ చేస్తోందని పోలీసులు తెలిపారు.

ఇప్పటివరకు గెహనా 87 పార్న్ వీడియోలను చిత్రీకరించి పలు వెబ్‌‌సైట్స్‌‌లో అప్‌‌లోడ్ చేసిందని పోలీసు సీనియర్ అధికారి వివరించారు. ఆమెను ఆదివారం కోర్టులో హాజరపర్చనున్నారు. మిస్ బికినీ క్రౌన్ విన్నర్ అయిన గెహనా.. పలు హిందీ, తెలుగు సినిమాలతోపాటు అడ్వర్టయిజ్‌‌మెంట్స్‌‌లోనూ నటించింది. కాగా నిందితుల బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.36 లక్షల నగదును సీజ్ చేశామని పోలీసులు చెప్పారు.