మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే ప్రమాణం

మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే ప్రమాణం

మహారాష్ట్ర 18 వ ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని శివాజీపార్క్‌లో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి ఉద్ధవ్ చేత సీఎంగా ప్రమాణం చేయించారు. ఉద్దవ్ తో పాటు  శివసేన నేతలు ఏక్ నాథ్ షిండే, సుభాష్ దేశాయ్, ఎన్సీపీ నేతలు జయంత్ రాజారాం పాటిల్, ఛగన్ చంద్రకాంత్ భుజ్బల్ లు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన అగ్ర నేతలు హాజరయ్యారు.