ఎస్సార్‌ నగర్‌లో దారుణం..ప్రేమ జంటపై కత్తితో దాడి

ఎస్సార్‌ నగర్‌లో దారుణం..ప్రేమ జంటపై కత్తితో దాడి

హైదరాబాద్ ఎస్సార్ నగర్ లో దారుణం జరిగింది. నడి రోడ్డుపై అందరు చూస్తుండగానే ఓ ప్రేమ జంటపై  దాడి జరిగింది. అమ్మాయి అన్నయ్య ఆ యువకుడిని కత్తితో పొడిచి పారిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అతడి పరిస్థితి విషమంగా ఉంది.

సంగారెడ్డికి చెందిన యువకుడు ఇంతియాజ్ హైదరాబాద్ లో పని చేస్తున్నాడు. బోరబండకు చెందిన ఓ ముస్లీం అమ్మాయిని ప్రేమించాడు. రంజాన్ రోజున ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. చర్చల కోసం ఇరు కుటుంబాలు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అయితే తమకు ప్రాణహాని ఉందని..తమకు రక్షణ కావాలని అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసి  బయటకు రాగానే వెంటనే అమ్మాయి అన్నయ్య కారులో వెళ్తున్న ఇంతియాజ్ ను బయటకు లాగి రోడ్డుపై అతి దారుణంగా కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ ఘటనపై సీీపీ అంజన్ కుమార్ స్పందించారు. ఈ ఘటనకు బంధించిన వీడియో కానీ, ఫోటోలను కానీ సోషల్ మీడియాలో ఎవరూ ప్రచారం చేయొద్దని .. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.