నోరుజారిన మ్యూజిక్ డైరెక్టర్... ప్రభాస్, హను మూవీపై క్లారిటీ ఇచ్చేశాడు

నోరుజారిన మ్యూజిక్ డైరెక్టర్... ప్రభాస్, హను మూవీపై క్లారిటీ ఇచ్చేశాడు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), పాన్ ఇండియా లెవల్లో భారీ హిట్టు కొట్టిన దర్శకుడు హను రాఘవపూడి(Hanu Raghavapudi). ఈ కాంబోలో ఓ సినిమా రానుంది అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ, ఈ ప్రాజెక్టు పై అటు హీరో గానీ, అటు దర్శకుడు గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ, ఈ ప్రాజెక్టు పక్కాగా రానుంది అని సోషల్ మీడియాలో బలమైన టాక్ వినిపించింది. దీంతో ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు పై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది అని అనుకున్నారు ఆడియన్స్. 

అయితే.. అనుకోని విధంగా సంగీత దర్శకుడు ప్రభాస్, హను సినిమాపై నోరు జారాడు. ఆ సంగీత దర్శకుడు  మరెవరో కాదు.. సీతారామం సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన విశాల్ చంద్రశేఖర్(Vishal Chandrashekhar). కేవలం సీతారామం కు మాత్రమే కాదు హను చేసిన గత రెండు సినిమాలకు కూడా విశాల్ సంగీతం అందించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్.. తన తరువాతి సినిమాల గురించి మాట్లాడుతూ.. అనుకోకుండా ప్రభాస్, హను ప్రాజెక్టు కూడా నేనే చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త వైరల్ గా మారింది. 

ఇన్ని రోజులుగా ఈ ప్రాజెక్టుపై ఉన్న అనుమానాలన్నీ ఒక్కసారిగా పటాపంచలయ్యాయి. హనుతో సినిమా చేస్తుండటంపై ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. హను గత చిత్రాల ద్వారా ఆయనకో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సీతరామం తో ఆ ఫేమ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ఇక ప్రభాస్, హను సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం కూడా ఆర్మీ బ్యాక్డ్రాప్ ను ఎంచుకున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. రెండవ ప్రపంచయుద్ధం నేపధ్యంలో సాగనున్న ఈ సినిమాలో ప్రభాస్ యుద్ధవీరుడిగా ఆర్మీ మ్యాన్ లా కనిపించనున్నాడట. మరి ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడిన ఈ సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.