మెగా మ్యూజికల్ మ్యానియా షురూ.. భోళా శంకర్ సాలిడ్ అప్డేట్

మెగా మ్యూజికల్ మ్యానియా షురూ.. భోళా శంకర్ సాలిడ్ అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాకి సంబంధించిన మ్యూజికల్ మ్యానియా మొదలు కానుంది. దీనిపై తాజాగా అధికారిక ప్రకటన చేస్తూ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసారు  మేకర్స్. ఈ సినిమా నుండి మొదటి సింగల్ త్వరలో రిలీజ్ కానుంది. స్వరబ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అందుకే ఈ సినిమా పాటల కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు. 

మెగాస్టార్ సినిమా అంటేనే పాటలు, డాన్సులు, స్టెప్పులు కదా. ఇప్పుడు ఈ సినిమా కోసం కూడా అదే రేంజ్ లో మాస్ అండ్ క్లాస్ మ్యూజిక్ బీట్స్ ను సెట్ చేసాడట మహతి స్వర సాగర్. ఇక చిరంజీవి లాంటి స్టార్ హీరోకి మొదటి సారి మ్యూజిక్ చేస్తుండటంతో.. ట్యూన్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడట ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. తమిళ హిట్ సినిమా వేదాలంకు రీమేక్ గా రానున్న ఈ సినిమాలో.. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, మాస్ డైరెక్టర్ మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు. 

దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లిగా నటిస్తుండగా.. అక్కినేని హీరో సుశాంత్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా వేదాలం సినిమాలా భారీ హిట్ గా నిలిస్తుందా చూడాలి మరి.