
కుంటాల, వెలుగు: గణేశ్లడ్డూనూ ఓ ముస్లిం బాలుడు దక్కించుకున్నాడు. కుంటాల మండలంలోని అంబకంటి శుక్రవారం స్థానిక యూత్ సభ్యులు గణేశ్ లడ్డూకు వేలంపాట నిర్వహించారు. గ్రామానికి చెందిన ఏడో తరగతి స్టూడెంట్ఎస్ కే రెహాన్ రూ.1111 వేలంపాడి లడ్డూను దక్కించుకున్నాడు. కులమతాలకు అతీతంగా ఐక్యతను చాటిన రెహాన్ ను గ్రామస్తులు అభినందించారు.