
మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సమర్పణలో కిషోర్ తేజా, సాత్విక లీడ్ రోల్స్‌లో నటించిన ఆల్బమ్ సాంగ్ ‘మై లవ్’. వాకాడ అప్పారావు నిర్మించిన ఈ పాటను శుక్రవారం విడుదల చేశారు. క్రాంతి ఆచార్య కంపోజ్ చేసిన ఈ పాటకు సురేష్ బనిశెట్టి లిరిక్స్ అందించగా, కపిల్ కపిలన్ పాడిన తీరు ఆకట్టుకుంది. కిషోర్ తేజ, సాత్విక కెమిస్ట్రీ లవ్లీగా ఉంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో కిషోర్ తేజ మాట్లాడుతూ ‘మా డైరెక్టర్ రామ్ రెడ్డి ఈ పాట కోసం సినిమా స్థాయిలో కష్టపడ్డారు. డీవోపీ జయపాల్ రెడ్డి హార్డ్ వర్క్ చేసి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు.
ఈ పాటను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పాడు. ఈ సాంగ్‌లో తనను తాను చూసుకోవడం హ్యాపీగా అనిపించిందని సాత్విక చెప్పింది. ‘బిగ్ బాస్’ ఫేమ్ అమర్ దీప్, దివి ఈ కార్యక్రమంలో పాల్గొని టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.