స్కిన్ మాఫియా చూపించా : ఓంకార్ శ్రీనివాస్

స్కిన్ మాఫియా చూపించా : ఓంకార్ శ్రీనివాస్

హన్సిక లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో ఓంకార్ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’.  బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన సినిమా నవంబర్ 17న  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఓంకార్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘కమర్షియల్ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌తో ఒక సోషల్ ఇష్యూని ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నమే ఈ చిత్రం. కంప్లీట్ స్క్రీన్‌‌‌‌‌‌‌‌ప్లే బేస్డ్ సినిమా ఇది.  ఓ అమ్మాయి విషయంలో రియల్‌‌‌‌‌‌‌‌గా చూసిన ఘటనను స్ఫూర్తిగా తీసుకొని కథన రాశా. 

ఆర్గాన్ మాఫియా బ్యాక్ డ్రాప్‌‌‌‌‌‌‌‌లో ఉంటుంది. మెడికల్ మాఫియా, కిడ్నీ మాఫియా లాంటివి చూసుంటాం కానీ ఇందులో స్కిన్ కు సంబంధించిన మాఫియాను తీసుకున్నాం. దీని కోసం నాలుగు సంవత్సరాలు చాలా రీసెర్చ్ చేశా. స్కిన్ మాఫియా ట్రాప్‌‌‌‌‌‌‌‌లో పడకుండా తనను తాను కాపాడుకునే పాత్రలో హన్సిక కనిపిస్తారు.  హన్సిక వాళ్ళ అమ్మ రియల్‌‌‌‌‌‌‌‌గా స్కిన్ డాక్టర్ కావడంతో హన్సిక ఈ స్టోరీ కి బాగా కనెక్ట్ అయ్యారు. తన స్కిన్ టోన్ కూడా ఈ సినిమాకి ప్లస్ అయింది. విలేజ్ నుంచి తన డ్రీమ్‌‌‌‌‌‌‌‌ని నెరవేర్చుకోవడానికి సిటీకి వచ్చే అమ్మాయిగా హన్సిక కనిపిస్తుంది. హ్యాపీగా గడుస్తున్న జీవితంలో అనుకోని సంఘటన జరుగుతుంది. ఆ ఘటనను హన్సిక ఫేస్ చేసిందనేది ఆసక్తికరంగా, ఎంగేజింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. మార్క్ కె  రాబిన్ మ్యూజిక్ హైలైట్‌‌గా ఉంటుంది’ అని చెప్పాడు.