Sreeja Konidela : నేనేం పాపం చేశానని ఇన్ని కష్టాలు?.. ఆ చీకటి రోజులు తలచుకుని చిరంజీవి కూతురు ఎమోషనల్!

Sreeja Konidela : నేనేం పాపం చేశానని ఇన్ని కష్టాలు?.. ఆ చీకటి రోజులు తలచుకుని చిరంజీవి కూతురు ఎమోషనల్!

మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చెల్లెలు శ్రీజ కొణిదెల తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అనుభవించిన బాధలపై తొలిసారిగా స్పందించారు. సాధారణంగా మెగా ఫ్యామిలీ విషయాలన్నా, శ్రీజ పర్సనల్ లైఫ్ అన్నా సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్కే.. అయితే ఈసారి ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న చీకటి రోజులు, ఆ వేదన నుంచి ఎలా బయటపడిందో చెప్తూ వీడియోలను రిలీజ్ చేశారు.. ఈ క్రేజీ వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

నాకే ఎందుకిలా జరుగుతోంది?
గత కొన్ని నెలలుగా సైలెంట్‌గా ఉన్న శ్రీజ, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పవర్‌ఫుల్ వీడియో షేర్ చేసింది. అందులో తన గతాన్ని తలచుకుంటూ ఎంతో ఎమోషనల్ అయింది. ఒకప్పుడు నా లైఫ్‌లో జరిగిన తప్పులే నా గుర్తింపు అనుకున్నాను. నాకే ఎందుకిలా జరుగుతోంది? నేనేం పాపం చేశానని ఒకదాని వెంట ఒకటి ఇన్ని కష్టాలు వస్తున్నాయి? అని తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తూ బాధితురాలిగా (Victim) మిగిలిపోయాను అంటూ ఎమోషనల్ అయింది.

 కానీ, 'శ్రీ పీఠం' (Sacred Paths) వ్యవస్థాపకురాలు అనురాధా రమేష్ ఆధ్వర్యంలో నేను చేసిన 15 నెలల 'సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్' నా ఆలోచనలను మార్చేసింది.. నా జీవితాన్ని నేనే నిర్మించుకోగలను అనే ధైర్యాన్ని ఇచ్చింది, అంటూ క్లారిటీ ఇచ్చింది శ్రీజ . ఈ క్రేజీ పోస్ట్‌కు నిహారిక కొణిదెల రియాక్ట్ అవుతూ.. 'మై సూపర్ ఉమెన్' అంటూ కామెంట్ చేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sreeja (@sreejakonidela)

 

సంచలనాల శ్రీజ..

శ్రీజ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిదే. 2007లో కేవలం 19 ఏళ్ల వయసులోనే శిరీష్ భరద్వాజ్‌ను లవ్ మ్యారేజ్ చేసుకుని సంచలనం సృష్టించింది. ఆర్యసమాజ్‌లో జరిగిన వీరి పెళ్లి అప్పట్లో నేషనల్ మీడియాలో మార్మోగింది. వీరికి 2008లో నివృతి జన్మించింది. అయితే, 2011లో వరకట్న వేధింపుల కేసు నమోదు కావడంతో 2014లో విడాకులు తీసుకుని శ్రీజ పుట్టింటికి వచ్చేసింది.  ఆ తర్వాత 2016లో తన చిన్ననాటి స్నేహితుడు, నటుడు కల్యాణ్ దేవ్‌ను గ్రాండ్‌గా రెండో పెళ్లి చేసుకుంది. వీరికి 2018లో నవిష్క జన్మించింది. కానీఈ బంధం కూడా 2022లో ముగిసిపోయింది.

సరికొత్తగా లైఫ్‌తో..

ఎన్ని తుఫానులు వచ్చినా, ఇద్దరు కూతుళ్ల బాధ్యతను మోస్తూ, మెగా ఫ్యామిలీ సపోర్ట్‌తో శ్రీజ ఇప్పుడు సరికొత్తగా లైఫ్‌ను స్టార్ట్ చేసింది.  బాధ నాలో ఒక భాగమే కానీ, అదే నా జీవితం కాదంటూ శ్రీజ చెప్పింది. ఆమె మాటలు, బ్రేకప్స్ అండ్ లైఫ్ స్ట్రగుల్స్‌తో బాధపడే ఎందరో మహిళలకు ఇప్పుడు ఒక బిగ్ ఇన్‌స్పిరేషన్. శ్రీజ కంబ్యాక్ ఈజ్ రియల్లీ నెక్స్ట్ లెవెల్ అంటూ మెగా ఫ్యాన్స్ ఆమెకు సపోర్టు చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ : అసలు పరీక్ష ఇప్పుడే.. తగ్గుతున్న ‘పెద్ది’ కలెక్షన్స్..

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sreeja (@sreejakonidela)