సంక్రాంతికి వరలక్ష్మిగా..ఆషికా రంగనాథ్

సంక్రాంతికి వరలక్ష్మిగా..ఆషికా రంగనాథ్

‘అమిగోస్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ హీరోయిన్ ఆషికా రంగనాథ్.. ప్రస్తుతం తెలుగులో బిజీ అవుతోంది. నాగార్జున హీరోగా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో రూపొందుతున్న ‘నా సామిరంగ’లో ఆమె హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి సోమవారం ఆషిక పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో ఆమె ‘వరలక్ష్మి’ పాత్ర పోషిస్తోందంటూ తన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు.

లంగావోణీలో ట్రెడిషినల్‌‌ గెటప్‌‌లో ఆషిక ఆకట్టుకుంటోంది. అచ్చ తెలుగు అమ్మాయిలా, చక్కని హావభావాలతో ఆమెను ప్రజెంట్ చేశాడు దర్శకుడు విజయ్. ఆస్కార్ అవార్డ్‌‌ విన్నర్లు కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, చంద్రబోస్ లిరిక్స్ రాస్తున్నారు.  ప్రసన్న కుమార్ బెజవాడ స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్నాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌‌లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.