సంగీత్ శోభన్ హీరోగా మిస్టరీ థ్రిల్లర్

సంగీత్ శోభన్ హీరోగా మిస్టరీ థ్రిల్లర్

మరోవైపు సంగీత్ శోభన్‌‌‌‌ హీరోగా సాహు గారపాటి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘సాహో’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌‌‌‌గా పనిచేసిన ప్రణయ్ రావు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఇదొక మిస్టరీ థ్రిల్లర్‌‌‌‌ అయినప్పటికీ ఇందులో కామెడీ కీలకంగా ఉండనుందని మేకర్స్‌‌‌‌ తెలియజేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం 
కానుంది. 

మారుతి ప్రేమకథ

మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో హీరోగా తనదైన మార్క్‌‌‌‌ చూపించిన సంగీత్ శోభన్‌‌‌‌.. బ్యాక్ టు బ్యాక్‌‌‌‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు.  తను హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్‌‌‌‌లో ధీరజ్ మొగిలినేని,  గిరిబాబు వల్లభనేని ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనస్వర రాజన్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ ట్రెండీ లవ్ స్టోరీకి లక్ష్మీ భూపాల్ రైటర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు.

బుధవారం సంగీత్ బర్త్ డే సందర్భంగా విషెస్‌‌‌‌ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అతను మారుతి అనే పాత్రలో నటిస్తున్నట్టు రివీల్‌‌‌‌ చేశారు. టైటిల్ గ్లింప్స్‌‌‌‌ను ఈ నెల 23న విడుదల చేయబోతున్నట్టు తెలియజేశారు.