నా వల్ల కాదే బొమ్మ సాంగ్ విడుదల

నా వల్ల కాదే బొమ్మ సాంగ్ విడుదల

సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫాంటసీ చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్స్.  అనిల్ సుంకర సమర్పణలో రాజేష్​ దండా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌‌‌‌‌‌‌‌తో పాటు ‘నిజమే నే చెబుతున్నా’ అంటూ వచ్చిన ఫస్ట్ సాంగ్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి.

శనివారం రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. ‘నా వల్ల కాదే బొమ్మ.. నీ కళ్లు చూస్తే అమ్మ’ అంటూ సాగిన పాటకు  శేఖర్ చంద్ర ట్యూన్ కంపోజ్ చేయడంతో పాటు తిరుపతి జావనతో కలిసి క్యాచీ లిరిక్స్ రాశాడు. రామ్ మిరియాల పాడిన విధానం ఇంప్రెస్ చేసింది. ఈ పెప్పీ సాంగ్‌‌‌‌లో సందీప్, వర్ష కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ‘టైగర్’ తర్వాత సందీప్ కిషన్, విఐ ఆనంద్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ కావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.