Naa SaamiRanga Day1 collections: దుమ్ములేపిన నా సామిరంగ.. నాగ్ సినిమాకు సూపర్ కలెక్షన్స్

Naa SaamiRanga Day1 collections: దుమ్ములేపిన నా సామిరంగ.. నాగ్ సినిమాకు సూపర్ కలెక్షన్స్

కింగ్ నాగార్జున(Nagarjuna) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ నా సామిరంగ(Naa Saamiranga). డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ(Vijay Binny) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఆషిక రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్ గా నటించగా.. అల్లరి నరేష్(Allari Naresh), రాజ్ తరున్(Raj Tharun) కీ రోల్స్ చేశారు. దీంతో ముందునుండే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు.. మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ వచ్చింది. అవుట్ అండ్ అవుట్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. 

మొదటిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.8 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఓపక్క గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ సినిమాల పోటీని తట్టుకొని నా సామిరంగా సినిమా రూ.8 కోట్ల వసూళ్లు రాబట్టింది అంటే మాములు విషయం కాదు. నిజానికి ఏ కాంపిటీషన్ లేకుండా ఉంది ఉంటే ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగేవని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక నా సామిరంగ సినిమాకు అన్ని ఏరియాలు కలుపుకొని రూ.18 కోట్ల బిజినెస్ జరిగింది. పండుగ సీజన్ కావడంతో.. ఈ సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలుస్తోంది. అలా తన కెరీర్ లో మరో బసూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు నాగార్జున.