నా సామిరంగ టీజర్ అదిరిపోయింది.. ముగ్గురు హీరోలు దుమ్ములేపేశారు!

నా సామిరంగ టీజర్ అదిరిపోయింది.. ముగ్గురు హీరోలు దుమ్ములేపేశారు!

టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. పెల్లెటూరి బ్యాక్డ్రాప్ లో ఫ్యామిలీ అండ్ మాస్ అంశాలతో ఈ టీజర్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. ఇటీవలో ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఉన్నారని చెప్పి సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్.. టీజర్ లో హీరో రాజ్ తరుణ్ ను చూపించి మరో  షాకించ్చారు. ఈ ముగ్గురు హీరోలు టీజర్ మొత్తం కుమ్మిపారేశారు. ఇవన్నీ చూస్తుంటే.. నా సామిరంగతో నాగార్జున పక్కా హిట్టు కొట్టేలాగే కనిపిస్తున్నారు.

మరోపక్క నాగార్జున ఫ్యాన్స్ ను కూడా ఈ సినిమాపై కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కారణం ఇంచు మించు ఇదే బ్యాక్డ్రాప్ లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమా సూపర్ హిట్ అవడం. అదే సెంటిమెంట్ తోనే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందని.