నాసామి రంగ టైటిల్ సాంగ్ వచ్చేసింది.. కుమ్మేసిన ముగ్గురు హీరోలు

నాసామి రంగ టైటిల్ సాంగ్ వచ్చేసింది.. కుమ్మేసిన ముగ్గురు హీరోలు

టాలీవుడ్ కింగ్ నాగార్జున(Nagarjuna) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ(Naa Saamiranga). ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ(Vijay Binny) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమిగోస్ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్.. తాజాగా ఈ సినిమా నుండి నాసామి రంగ టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మా జోలికొస్తే.. మాకడ్డువస్తే.. మామూలుగా ఉండదు నా సామిరంగ... ఈ గీత తొక్కితే.. మా సేత సిక్కితే.. మామూలుగా ఉండదు నా సామిరంగ.. అంటూ సాగిన ఈ పాట మాస్ ఆడియన్స్ తెగ అట్రాక్ట్ చేస్తోంది. కీరవాణి అందించిన బీట్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉండటంతో ఈ పాట సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ఈ మధ్య వచ్చిన టీజర్ కూడా సూపర్ గా ఉండటంతో.. ఈ సినిమా సంక్రాంతికి పక్కా పైసా వసూల్ సినిమా అవుతుందని నాగార్జున ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.