Naga Chaitanya: అత్యంత ఖరీదైన కారు కొన్న నాగ చైతన్య.. స్పెషాలిటీస్ ఇవే?

Naga Chaitanya: అత్యంత ఖరీదైన కారు కొన్న నాగ చైతన్య.. స్పెషాలిటీస్ ఇవే?

అక్కినేని వారసుడు నాగ చైతన్య(Naga Chaitanya) గురించి ప్రత్యకమైన పరిచయం అవసరం లేదు. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు నాగ చైతన్య. తన కథల ఎంపిక కూడా అలాగే ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటాడు ఈ హీరో. బయట కూడా చాలా కూల్ గా, కామ్ గా కనిపిస్తాడు. సినిమా ఫంక్షన్స్ లో కూడా ఎక్కువ కనిపించరు. కేవలం సినిమాలతో మాత్రమే ఆడియన్స్ ముందుకు వస్తుంటాడు ఈ హీరో. 

ఇదిలా ఉంటే.. సినిమా విషయంలో కాకుండా మరో విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు చై. అదేంటంటే.. తాజాగా చై ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఇక ఈ కారు.. Porsche 911 GT3 RS మోడల్ గా తెలుస్తోంది. సిల్వర్ కలర్ లో చాలా స్టైలీష్ గా ఉన్న ఈ కారు ధర దాదాపు రూ.4 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్.. ఒక్క కారుకి రూ.4 కోట్లా అంటూ అవాక్కవుతున్నారు.

ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన కార్తికేయ ఫేమ్ దర్శకుడు చందు మొండేటితో తండేల్ సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చై జాలరిగా కనిపించనున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. మరి నాగ చైతన్య చేస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.