తండేల్గా నాగ చైతన్య.. కొత్త లుక్ అదిరిపోయిందిగా!

తండేల్గా నాగ చైతన్య.. కొత్త లుక్ అదిరిపోయిందిగా!

అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) హీరోగా టాలెంటెడ్ దర్శకుడు చందు మొండేటి(Chandu mondeti) కాంబోలో ఒక మూవీ వస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థపై అల్లు అరవింద్ నిర్మిస్తుండగా.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తున్నారు. చాలా రోజుల క్రితమే అఫిషియల్ అనౌన్సమెంట్ వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉంది. 

అయితే తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుండి నాగ చైతన్య లుక్ అండ్ టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమా వస్తున్న ఈ ప్రాజెక్టుకు తండేల్(Thandel) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈమేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తండేల్ అంటే బోట్ నడిపేవారు అని అర్థం. గుజరాత్‌ లోని సూరత్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. అందమైన ప్రేమకథతో పాటు.. ఊహించని ట్విస్టులు టర్న్స్ తో ఈ సినిమా సాగనుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. 

ఇక పోస్టర్ లో నాగ చైతన్య లుక్ చాలా కొత్తగా ఉంది. బోట్ నడిపే వ్యక్తి పాత్రలో పర్ఫెక్ట్ సెట్ అయ్యారు చై. లాంగ్ హెయిర్ తో, చేతిలో తెడ్డు పట్టుకొని చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు . చూస్తుంటే తండేల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకునేలా ఉన్నాడు. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.