అదిరిపోయిన చై తండేల్ స్టిల్..మహాసముద్రాల మధ్యలో నయా షెడ్యూల్

అదిరిపోయిన చై తండేల్ స్టిల్..మహాసముద్రాల మధ్యలో నయా షెడ్యూల్

నాగచైతన్య (Nagachaitanya) హీరోగా రూపుదిద్దుకుంటున్న చిత్రం తండేల్ (Thandel). ఈ చిత్రంలో చైతు సరసన నటిస్తోంది సాయిపల్లవి (Saipallavi). ఇప్పటి వరకు తెలంగాణ గడుసు పిల్లగా అందరినీ అలరించిన సాయిపల్లవి..ఈ సారి శ్రీకాకుళం యాసలో పక్కా విలేజ్ గాళ్గా నటించనుంది. లవ్ స్టోరీ తర్వాత చైతు, సాయి పల్లవి కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

రొమాంటిక్‌ డ్రామా నేపథ్యంలో తండేల్‌ మూవీ తెరకెక్కిస్తున్నారు.  మేకర్స్‌ ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో చైతూ మాస్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్కు సంబంధించి తాజాగా అప్‌డేట్‌ బయటకు వచ్చింది. లైట్స్‌ ఆన్‌..స్టార్ట్‌ కెమెరా..యాక్షన్‌ అంటూ తండేల్‌ షూటింగ్‌ మొదలుపెట్టేసింది చైతూ టీం. మహాసముద్రాల మధ్యలో అడ్రినలిన్ పంపింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు చై న్యూ స్టిల్తో అప్డేట్ ఇచ్చారు. ఈ నడి సముద్రంలో చై చేసే సాహసాలు, ఆడియన్స్కి గూస్బంప్స్ తెప్పించేలా డైరెక్టర్ చందూ ప్లాన్ చేసినట్టు సమాచారం 

రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ చందు మొండేటి (Chandoomondeti) తండేల్ టైటిల్ వెనుక ఉన్న అర్దాన్ని వివరించాడు. తండేల్ అంటే గుజరాతీలో 'బోట్ ఆపరేటర్' అని చెప్పేశాడు. ఈ తండేల్ అనే పదాన్ని..గతంలో గుజరాత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని కుగ్రామాల్లోఎక్కువగా ఈ పదాన్ని పలికేవారని తెలిపారు.

అలాగే తండేల్ అంటే..నాయకుడు, కెప్టెన్ అట. ఎలాంటి భయం, బెరుకు లేనివాడు అని అలాంటి యోధుడినే తండేల్ అంటరాని తెలుస్తుంది.అంతేకాకుండా  మరికొన్ని అర్ధాలు ఉంటాయని చెప్పారు. శక్తివంతమైన, ఆకర్షణీయమైన, ఏకాగ్రత అని అర్ధం.మరి తండేల్ ఎలా ఆకట్టు కుంటుందో చూడాలి.

పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.