యూట్యూబ్ ప్రపంచంలోకి నాగచైతన్య.. ఛానల్ పేరేంటో తెలుసా?

యూట్యూబ్ ప్రపంచంలోకి నాగచైతన్య.. ఛానల్ పేరేంటో తెలుసా?

ప్రస్తుతం సోషల్ మీడియా ఏ రేంజ్లో ఊపేస్తుందో తెలిసిందే. ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ చాలానే ఉన్నాయి. సినీ సెలబ్రెటీస్ తాజా విషయాలు ఏంటో..ఏం మూవీస్ చేస్తున్నారో తరుచుగా చెక్ చేసే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు.  

ఇక సినీతారలు సైతం తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే స్టార్ హీరో హీరోయిన్లకు, డైరెక్టర్స్కు యూటుబ్ ఛానల్స్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వంటి ఫేమస్ సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా వీరిని కోట్లకు పైగా ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు.

ఇప్పుడు లేటెస్ట్ గా హీరో నాగచైతన్య (Naga Chaitanya) సైతం సోషల్ మీడియా జాబితాలోకి చేరిపోయారు. చైతూ సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసినట్లు తెలియజేస్తూ శుక్రవారం (నవంబర్ 17న) ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరుస సినిమాలతో బిజీగా ఉండే చైతూకి యూట్యూబ్ ఛానల్ ఎందుకు అనుకుంటున్నారా?

చై అప్ కమింగ్ మూవీస్, ప్రమోషన్స్, సరదాగా గడిపే వీడియోస్ అప్లోడ్ చేస్తే..వచ్చే వ్యూస్ కి అమౌంట్ వస్తే అనాధ ఆశ్రమాలకు, క్యాన్సర్తో బాధపడే పిల్లల పరిరక్షణకు డొనేట్ చేసే అవకాశం ఉంది. ఇంతకీ ఆ యూట్యూబ్ ఛానల్ పేరెంటీ అనుకుంటున్నారా ?..అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya)’ అని వీడియోలో తెలిపారు. చైతూకి భారీ సంఖ్యలో అభిమానులు ఉండటంతో..యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన చైకి వెల్కమ్ అంటూ విషెస్ చెబుతున్నారు.