ఆరంభం మూవీ టీజర్‌‌‌‌ రిలీజ్ చేసిన నాగచైతన్య

ఆరంభం మూవీ టీజర్‌‌‌‌ రిలీజ్ చేసిన నాగచైతన్య

మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ ముఖ్యపాత్రల్లో అజయ్ నాగ్ వి తెరకెక్కిస్తున్న డిఫరెంట్ థ్రిల్లర్ ‘ఆరంభం’. అభిషేక్ వి.టి నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టీజర్‌‌‌‌ను నాగచైతన్య విడుదల చేశారు. యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌‌తో టీజర్ చాలా ఆసక్తిగా ఉందని, రామాయణ కథను వినిపిస్తూ, ఇంటర్ కట్స్‌‌లో విజువల్స్‌‌ చూపించడం డిఫరెంట్‌‌గా ఉందని టీమ్ అందరికీ బెస్ట్‌‌ విషెస్‌‌ చెప్పాడు నాగచైతన్య.

ఇప్పటిదాకా వినని ఒక కథ చెబుతానంటూ ఒక మహిళ చెప్పే కథతో టీజర్ మొదలైంది. ‘శ్రీరాముడు తన అవతారం చాలించి వైకుంఠానికి వెళ్లే సమయంలో.. హనుమంతుడు తనను వెళ్లనివ్వడని తన ఉంగరాన్ని ఓ పుట్టలో జారవిడుస్తాడు. ఆ ఉంగరం తెచ్చేందుకు వెళ్లిన హనుమంతుడికి పాతాళలోకంలో అనేక ఉంగరాలు కనిపిస్తాయి.  అవన్నీ శ్రీరాముడివే అని వాసుకి చెబుతుంది’ అనే వాయిస్ వినిపిస్తుంటే... జైలు, ఒక కేసు వివరాలు, గ్రే షేడ్స్  ఉండే పాత్రలు, జరగనివి జరిగినట్లు అనిపించే డెజావు ఏంటి అనే అంశాలు చూపించారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఆకట్టుకున్నాయి.