ఎన్టీఆర్తో ఐరన్ మ్యాన్ లాంటి మూవీ.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

ఎన్టీఆర్తో ఐరన్ మ్యాన్ లాంటి మూవీ.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

ఆర్ఆర్ఆర్(RRR) లాటి గ్లోబల్ హిట్ తరువాత ఎన్టీఆర్(Ntr) క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ఆ ఎఫెక్ట్ ఆయన తరువాత సినిమాలపై కూడా పడుతోంది. అందుకే తన తరువాతి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala shiva)తో దేవర(Devara) అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. 

ఈ సినిమా తరువాత బాలీవుడ్ లో అడుగుపెట్టనున్నారు ఎన్టీఆర్. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హ్రితిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్. యాష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ సినిమాపై కూడా నెక్స్ట్ లెవల్లో అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక తాజాగా ఎన్టీఆర్ కు సంబందించిన మరో ప్రాజెక్టు గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదేంటంటే.. టాలీవుడ్ నిర్మాత నాగవంశీ ఎన్టీఆర్ తో సూపర్ హీరో సినిమా చేయాలనుకుంటున్నారా. దీనికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగవంశీ. రీసెంట్ గా ఆయన బ్యానర్ నుండి వచ్చిన మూవీ మ్యాడ్. ఎన్టీఆర్ బావమరిది నార్నే నైతిక హీరోగా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. నాకు సూపర్ హీరోస్ సినిమాలు అంటే చాలా ఇష్టం. మన దగ్గర కూడా అలాంటి ఒక సినిమా తీయాలనేది నా కోరిక. ఎన్టీఆర్ తో ఐరన్ మ్యాన్ సినిమా  తీయాలనుకుంటున్నాను. ఆ పాత్రకు ఆయన సరిగ్గా సరిపోతారు. అందుకే ఆయన్ని ఐరన్ మ్యాన్ లా చూపించాలనుకుంటున్నాను. అవుతుందో లేదో తెలీదు కానీ..  ఆయనతో ఐరన్ మ్యాన్ లాంటి సినిమా చేయాలని ఉంది.. అని చెప్పుకొచ్చారు నాగవంశీ. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.