విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా రూపొందిస్తున్న చిత్రం ‘నాగబంధం’. ఈ మైథలాజికల్ అడ్వెంచర్ మూవీని కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. జులై 3న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రమోషనల్ టూర్‌ను ప్రకటించారు మేకర్స్.
సాధారణ ప్రమోషన్స్‌కు భిన్నంగా, సినిమా కథలోని ట్రెజర్ హంట్ కాన్సెప్ట్‌కు అనుగుణంగా ఈ ప్రమోషనల్ టూర్‌ను రూపొందించారు. ఈ టూర్‌లో తొలి కార్యక్రమం జూన్ 19న హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్. సినిమా స్థాయి, విజువల్స్, కథపై మరింత ఆసక్తిని పెంచేలా ఈ ఈవెంట్ ఉండనుంది. అనంతరం జూన్ 20 నుంచి 23 వరకు ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చి నగరాల్లో వరుసగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
జూన్ 26న వారణాసిలో ‘వీర నాగ’ పాటను విడుదల చేయడం ఈ టూర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక జూన్ 28న హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్, జులై 2న స్పెషల్ ప్రీమియర్ షో నిర్వహించనున్నారు. మరోవైపు ఈ మూవీ నైజాం థియేట్రికల్ రైట్స్‌ను దిల్ రాజు సొంతం చేసుకోవడంతో, ఈ చిత్రం తెలంగాణలో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
