Nagarjuna: 'మనం' తర్వాత నా బిడ్డ సినిమా కోసమే ఇంతగా.. 'లెనిన్' ప్రెస్ మీట్‌లో నాగార్జున ఎమోషనల్!

Nagarjuna: 'మనం' తర్వాత నా బిడ్డ సినిమా కోసమే ఇంతగా.. 'లెనిన్' ప్రెస్ మీట్‌లో నాగార్జున ఎమోషనల్!

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని, టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే జంటగా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'లెనిన్'. సూర్యదేవర నాగవంశీతో కలిసి కింగ్ నాగార్జున స్వయంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్ ఈ మూవీ చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి కీలక విషయాలను వెల్లడించింది..

ప్రేక్షకులను మోసం చేయడం ఇష్టం లేకే లేట్..

నిజానికి ఈ సినిమా జూన్‌లోనే రావాల్సింది. అయితే రిలీజ్ వాయిదా పడటంపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం ఈ సినిమాను కేవలం ఓటీటీ మార్కెట్ కోసమో, లాభాల కోసమో తీయలేదు. ప్రేక్షకులకు బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడమే మా లక్ష్యం. టెక్నికల్‌గా ఇంకా పర్‌ఫెక్ట్‌గా రావడం కోసమే మరో రెండు వారాలు టైమ్ తీసుకున్నాం. ఆడియన్స్‌ను మోసం చేయడం ఇష్టం లేకే ఈ నిర్ణయంఅంటూ నాగ్ క్లారిటీ ఇచ్చారు. మా నాన్నగారి క్లాసిక్ మూవీ 'మనం'ప్రమోషన్స్ తర్వాత.. మళ్లీ నా బిడ్డ అఖిల్ సినిమా కోసమే నేను ఇంతగా ఇన్వాల్వ్ అయి పని చేస్తున్నా అంటూ నాగ్ ఎమోషనల్ అయ్యారు.

నన్ను మార్చేసిన 'లెనిన్'..

ఈ కథ విన్నాక నాలో చాలా మార్పు వచ్చిందని చెప్పారు అఖిల్. ఎంతో ప్రశాంతంగా మారిపోయాను. 'లెనిన్' పాత్ర కోసం నన్ను నేను మానసికంగా సిద్ధం చేసుకున్నాను. జూలై 10న థియేటర్లలో కంటెంటే మాట్లాడుతుంది అంటూ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో చెప్పాడు. ఈ చిత్రంలో శివాజీ, బ్రహ్మాజీ, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషించగా, థమన్ సంగీతం అందించారు. శ్రీరామాపురం అనే ఊరి నేపథ్యంలో సాగే ఈ కథ అక్కినేని ఫ్యాన్స్‌కు సరికొత్త అనుభూతిని ఇవ్వబోతోంది.

తెల్లవారుజామున 5 గంటలకే ఆట..

ఈ మధ్య టాలీవుడ్‌లో పెయిడ్ ప్రీమియర్స్ ట్రెండ్ నడుస్తోంది. కానీ 'లెనిన్' టీమ్ మాత్రం ఎలాంటి ప్రీమియర్స్ లేకుండా నేరుగా పబ్లిక్ షోలకే వెళ్తోంది. జూలై 10న ఉదయం 5 గంటలకే ఇండియాలో షోలు ప్రారంభం కానున్నాయి. అటు ఓవర్సీస్‌లోనూ ఇండియన్ టైమ్ ప్రకారం తెల్లవారుజామున 4:30 గంటలకే షోలు పడబోతున్నాయి. అంటే వరల్డ్ వైడ్ ఒకేసారి 'లెనిన్' హంగామా షురూ కానుంది. మరి సరికొత్త లుక్‌లో రాబోతున్న అఖిల్‌కు ఈ సినిమా ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి..