ఊటీలో వేట

ఊటీలో వేట

‘బంగార్రాజు’లో పల్లెటూరి సోగ్గాడిగా ఆకట్టుకున్న నాగార్జున, ‘ఘోస్ట్’ సినిమా కోసం స్టైలిష్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌లోకి మారిపోయారు.  ఇందులో ఆయన ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నారు. ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ సత్తారు దర్శకుడు. సోనాల్ చౌహాన్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌. జెట్‌‌‌‌‌‌‌‌ స్పీడుతో షూటింగ్ చేస్తోన్న టీమ్, ఇప్పటికే దుబాయ్‌‌‌‌‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను కంప్లీట్ చేసింది. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సులు, కొన్ని ఇంపార్టెంట్ సీన్స్‌‌‌‌‌‌‌‌తో పాటు ఓ రొమాంటిక్ సాంగ్‌‌‌‌‌‌‌‌ని కూడా అక్కడ తీశారు. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ఊటీలో కొత్త షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్ చేశారు. ‘ఊటీలో ఉదయాలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి’ అంటూ షూటింగ్ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ను షేర్ చేశాడు ప్రవీణ్‌‌‌‌‌‌‌‌. యాక్షన్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా విజువల్ ఫీస్ట్‌‌‌‌‌‌‌‌లా ఉంటుందంటున్నారు మేకర్స్. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు.