నాగ్ నా సామిరంగ కలెక్షన్స్..బాక్సాఫీస్ వద్ద కిష్టయ్య హావా

నాగ్ నా సామిరంగ కలెక్షన్స్..బాక్సాఫీస్ వద్ద కిష్టయ్య హావా

టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ నా సామిరంగ (Naa Saamiranga). విజయ్ బిన్నీ (Vijay Binny) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీ రోల్స్ ప్లే చేయగా..సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాపీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది. 

పండుగ సెలవులు, ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా మూవీ కావడంతో..ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఇష్టపడుస్తున్నారు. దీంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే నా సామిరంగ మూవీకి నాలుగు రోజుల్లో రూ.15.63 కోట్లు షేర్ రాబట్టింది. మూడు రోజుల్లోనే రూ. 24.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ అందుకుంది. నా సామిరంగ మూవీ ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ. 30.3 కోట్ల గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పొంగల్ హాలిడేస్ పొడిగించడం వల్ల రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్..ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో చాలా రోజుల తరువాత నాగార్జునకు నా సామిరంగ రూపంలో భారీ బ్లాక్ బస్టర్ పడింది. 
 
తెలుగు రాష్ట్రాల్లో ‘నా సామిరంగ’ 4వ రోజు ఏరియా వైజ్ కలెక్షన్స్ చూసుకుంటే..
నైజాంలో – 85 లక్షలు
సీడెడ్ – 51 లక్షల
వెస్ట్ – 21 లక్షలు
కృష్ణ – 23 లక్షలు
గుంటూరు – 31 లక్షలు
వైజాగ్ – 47 లక్షలు
ఈస్ట్ – 42 లక్షలు
నెల్లూరు – 17 లక్షలు
4వ రోజు షేర్ – 3.17 కోట్లు
AP & TS షేర్ (4 డేస్) – 15.63 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ – 30.3 కోట్లు