సంక్రాంతి కింగ్ నాగార్జున.. నా సామిరంగ ఇవేం కలెక్షన్స్ సామి.

సంక్రాంతి కింగ్ నాగార్జున.. నా సామిరంగ ఇవేం కలెక్షన్స్ సామి.

టాలీవుడ్ కింగ్ నాగార్జున(Nagarjuna) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ నా సామిరంగ(Naa Saamiranga). విజయ్ బిన్నీ(Vijay Binny) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీ రోల్స్ ప్లే చేయగా.. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఊహించని విదంగా హిట్ టాక్ అందుకుంది. పండుగ సెలవులు, ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా మూవీ కావడంతో.. ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఇష్టపడుస్తున్నారు. దీంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి.

నా సామిరంగ సినిమాకు మొదటిరోజు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు రూ.8.7 కోట్లు కలెక్ట్ చేసింది ఈ మూవీ. ఇక్కడ మరో విశేషం ఏంటంటే..  మొదటిరోజు కంటే రెండోరోజు ఎక్కువ కలెక్షన్స్ సాధించింది ఈ మూవీ. రెండు రోజు ఏకంగా రూ.8.8 కోట్ల వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. నిజానికి ఈ సంక్రాంతికి నాలుగు సినిమాకు గట్టి పోటీ ఉంది. అంత కాంపిటీషన్ లో సైతం నా సామిరంగ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయంటే అది మామూలు విషయం కాదు. ఇక మొత్తంగా రెండు రోజులకు కలిపి రూ.17.8 కోట్లు రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది నా సామిరంగ. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో చాలా రోజుల తరువాత నాగార్జునకు నా సామిరంగ రూపంలో భారీ బ్లాక్ బస్టర్ పడింది.