నాగార్జున సాగర్: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 537.50 అడుగులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు. ప్రస్తుతం నీటి నిల్వ: 183.1585 టీఎంసీలు. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలు. ఇన్‌ఫ్లో: 2,100 క్యూసెక్కులు. నీటిని మొత్తం కాలువల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.
కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల లేదు. SLBC (AMRP) ద్వారా 1,500 క్యూసెక్కుల నీటిని, లో లెవల్ కెనాల్‌కు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మొత్తంగా 2,100 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రధాన విద్యుత్ కేంద్రం (Power House) ద్వారా ప్రస్తుతం నీటి విడుదల లేదు.
ఇప్పటికే కుడి, ఎడమ కాలువలకు అధికారులు నీటి విడుదలను బంద్ చేశారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలోని చెరువులను నింపేందుకు 20 రోజులు నీటిని విడుదల చేశారు. పలు చెరువులను నీటితో నింపారు. సాగర్లో నీటి నిల్వలు తగ్గడంతో నీటి విడుదలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. అర్ధాంతరంగా నీటి సరఫరా నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కెనాల్నీటి ఆధారంగా వరి సాగు చేసిన రైతులు పంటలకు నీరు అందుతుందో.. లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
