సాగర్ టీడీపీ అభ్యర్థి మువ్వ అరుణ్​కుమార్

సాగర్ టీడీపీ అభ్యర్థి మువ్వ అరుణ్​కుమార్
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎల్ రమణ బరిలోకి దిగే చాన్స్

హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీడీపీ క్యాండిడేట్ గా మువ్వ అరుణ్ కుమార్ ను ఆ పార్టీ పొలిట్ బ్యూరో నేత అరవింద్ కుమార్ గౌడ్ శనివారం ప్రకటించారు. 1985 నుంచి అరుణ్ కుమార్ పార్టీలో పనిచేస్తున్నారని, అడ్వకేట్ గా ఫ్రీగా న్యాయ సేవలందిస్తున్నారని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ పోటీ చేస్తుందని, ఒక సీట్ నుంచి పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ పోటీ చేసే చాన్స్ ఉందన్నారు.