నాగార్జున ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటి' గీతాంజలి’. మణిరత్నం తెరకెక్కించిన ఈ క్లాసిక్ లవ్‌స్టోరీ ఇప్పుడు మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. ఈనెల 29న నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఒకరోజు ముందే ఆగస్టు 28న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో 4కె ఫార్మాట్‌లో వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రక్షాబంధన్ స్పెషల్ కూడా కావడంతో ఈ రీ- రిలీజ్ మరింత ప్రత్యేకంగా మారింది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బూర్లె శివ ప్రసాద్ ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ను లేటెస్ట్ టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
‘గీతాంజలి’ అంటే ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తొచ్చేది అందమైన ప్రేమకథ, మనసును తాకే సంగీతం, అద్భుతమైన విజువల్స్, గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్. నాగార్జునను ఎంతో చార్మింగ్‌గా, ఎమోషనల్‌గా చూపించిన ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. మణిరత్నం తనదైన స్టోరీ టెల్లింగ్‌తో ఈ ప్రేమకథను ఒక అందమైన కవితలా తెరకెక్కించారు. ఇళయరాజా అందించిన సంగీతం సినిమాకు మరో బలంగా నిలిచింది. నాగార్జున సరసన గిరిజ హీరోయిన్‌గా నటించారు.
