నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ మున్సిపాలిటీకి కేటాయించిన రూ.40 కోట్ల నిధుల్లో మార్పు..ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ

నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ మున్సిపాలిటీకి కేటాయించిన రూ.40 కోట్ల నిధుల్లో మార్పు..ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ

హైదరాబాద్, వెలుగు : నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనుల కోసం గతంలో మంజూరు చేసిన రూ. 40 కోట్ల అదనపు నిధుల కేటాయింపుల్లో మార్పులు చేస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి డాక్టర్ టి.కె. శ్రీదేవి గురువారం జీవో నెంబర్​ 953 ద్వారా అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. 

సెప్టెంబర్ 10న  జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ. 40 కోట్ల నిధులను పూర్తిగా నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ మున్సిపాలిటీలోని మిగిలిపోయిన భూగర్భ డ్రైనేజీ పనుల కోసమే కేటాయించారు. కాగా, తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్​ఐడీసీ) వీసీ ఎండీ  అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ నిధుల వినియోగంలో మార్పులు చేసింది.

 రూ.20 కోట్లు మౌలిక వసతుల పనుల కోసం, మరో రూ.20 కోట్లను సీసీ రోడ్ల నిర్మాణం కోసం కేటాయిస్తున్నట్లుగా ఉత్తర్వులలో పేర్కొంది. కలెక్టర్​ ద్వారా ప్రతిపాదనలు పొందిన పనులను త్వరితగతిన ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. 

ఆ మార్కెట్​ఇక ‘జిల్లా బహుళార్థ సాధక టౌన్​హాల్’​

నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్ భవన వినియోగాన్ని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మార్కెట్ భవనాన్ని ‘జిల్లా బహుళార్థ సాధక టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాల్’గా మార్చుతూ మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి డాక్టర్ టి.కె. శ్రీదేవి గురువారం జీవో నెంబర్​ 956 ద్వారా అధికారిక అనుమతి ఉత్తర్వులు జారీ చేశారు. 

కమిషనర్ అండ్​ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) పంపిన నివేదికల ఆధారంగా, ఆర్థిక శాఖ అంగీకారంతో ప్రభుత్వం ఈ మార్పుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత మార్కెట్ నిర్మాణాన్ని సంబంధిత శాఖకు అప్పగించేందుకు నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ మున్సిపల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.