మ్యాడ్​ మూవీకి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది : నాగవంశీ

మ్యాడ్​ మూవీకి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది : నాగవంశీ

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌‌‌‌ కుమార్, గోపికా ఉద్యాన్  లీడ్ రోల్స్‌‌‌‌లో నటించిన కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ‘మ్యాడ్‌‌‌‌’. కళ్యాణ్ శంకర్ దర్శకుడు. నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన  చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుందని నిర్మాతలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో నాగవంశీ మాట్లాడుతూ ‘కొత్త వాళ్లంతా కలిసి చేసిన ప్రయత్నిమిది. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓపెనింగ్స్ కూడా బాగా రావడం సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమాలు చేయడానికి మరింత ధైర్యం వచ్చింది’ అన్నారు. ఈ సినిమా రిజల్ట్‌‌‌‌తో హ్యాపీగా ఉన్నామన్నాడు దర్శకుడు శ్రీకాంత్. థియేటర్స్‌‌‌‌లో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారని నటీనటులు చెప్పారు.సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్‌తో పాటు టీమ్ అంతా పాల్గొన్నారు.