కాలుష్య నియంత్రణలో తెలంగాణ సత్తా..  టాప్-10 క్లీన్ ఎయిర్‌సిటిల్లో నల్లగొండ, సంగారెడ్డి

కాలుష్య నియంత్రణలో తెలంగాణ సత్తా..  టాప్-10 క్లీన్ ఎయిర్‌సిటిల్లో నల్లగొండ, సంగారెడ్డి
  • స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌ సర్వేల్లో  తెలంగాణ నగరాల హవా 

తెలంగాణలోని నల్లగొండ, సంగారెడ్డి సిటీలకు  అరుదైన గుర్తింపు లభించింది. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో దేశంలో టాప్ 10 క్లీన్ ఎయిర్ సిటీల్లో నల్లగొండ, సంగారెడ్డిలు నిలిచాయి. 3 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల జిబితా( కేటగిరీ3) లో సంగారెడ్డి 8వ స్థానంలో, నల్లగొండ 10వ స్థానంలో నిలిచాయి. దీంతో గాలి నాణ్యత, కాలుష్య నియంత్రణలో తెలంగాణ నగరాల పనితీరుపై ఆసక్తి నెలకొంది.

కేటగిరీ3లో ఒడిశాకు చెందిన కళింగనగర్, అంగుల్, తాల్చేర్ వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఏలూరు, హల్దియా, విజయనగరం, దేవాస్, సంగారెడ్డి, డామ్టల్, నల్లగొండ టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.

ఇదిలా ఉంటే .. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల జాబితాలో లక్నో 198 పాయింట్లతో నంబర్ వన్ గా నిలిచింది. 2025లో టాప్‌లో ఉన్న ఇండోర్ ఈసారి 197 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. జబల్‌పూర్ మూడో స్థానంలో నిలిచింది. సర్వేలో ప్రధానంగా PM10 కాలుష్య స్థాయిల తగ్గింపు, వ్యర్థాల నిర్వహణ, రోడ్ల పరిశుభ్రత, కాలుష్య నియంత్రణ చర్యలను పరిగణనలోకి తీసుకున్నారు.