బీఆర్ఎస్ కు నల్ల మనోహర్ రెడ్డి రాజీనామా

బీఆర్ఎస్ కు  నల్ల మనోహర్ రెడ్డి రాజీనామా

కేసీఆర్  పార్టీ  అభ్యర్థుల లిస్ట్ ప్రకటించడంతో బీఆర్ఎస్ లో లుకలుకలు మొదలయ్యాయి. టికెట్ రాని అసంతృప్త నేతలు పార్టీని వీడుతున్నారు. లేటెస్ట్ గా బీఆర్ఎస్ పార్టీకి సీనియర్ లీడర్ నల్ల మనోహర్ రెడ్డి రాజీనామా చేశారు.  పెద్దపల్లి టికెట్  దాసరి మనోహర్ రెడ్డికి కేటాయించడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు .   గత 15 ఏళ్లుగా పార్టీలో ఉంటూ కష్టపడ్డా పార్టీ తనను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి కేటీఆర్ కు తొమ్మిదేళ్లుగా ప్రధాన అనుచరుడుగా ఉన్నా పార్టీ తనకు అన్యాయం చేసిందన్నారు.  పెద్దపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.   రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని చెప్పారు.