NBK 110: మరో మెగా డైరెక్టర్కి బాలయ్య ఛాన్స్.. బాబీ తరువాత అతనే!

NBK 110: మరో మెగా డైరెక్టర్కి బాలయ్య ఛాన్స్.. బాబీ తరువాత అతనే!

అఖండ,(Akhanda) వీరసింహరెడ్డి(Veerasimhareddy), భగవంత్ కేసరి(Bhagavanth kesari).. వంటి వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna). అదే ఊపులో కొత్త ప్రాజెక్టులను కూడా మొదలుపెట్టేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు బాబీ కొల్లి(Bobby Kolli)తో NBK 109 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు బాబీ కొల్లి చేస్తున్న సినిమా కావడంతో NBK 109పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుండి ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇక ఈ సినిమా తరువాత బాలకృష్ణ చేయబోయే మూవీపై ఒక న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే.. బాలయ్య తన తరువాతి సినిమా కోసం మరో మెగా డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వనున్నాడట. ఇప్పటికే వాల్తేరు వీరయ్యతో మెగా డైరెక్టర్ గా మారిపోయిన బాబీతో సినిమా చేస్తున్న బాలకృష్ణ.. ఇప్పుడు తన తరువాతి సినిమా కోసం మాస్ అండ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ కు ఛాన్స్ ఇవ్వనున్నాడట. గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గడ్డలకొండ గణేష్, దువ్వాడ జగన్నాధం, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో హరీష్ మెగా డైరెక్టర్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. 

ఇప్పుడు ఈ దర్శకుడు నందమూరి కాంపౌడ్ లోకి అడుగుపెట్టనున్నాడట. ఇప్పటికే ఈ కాంపౌండ్ లో జూనియర్ ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా సినిమా చేశాడు హరీష్ శంకర్. కానీ, ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి నందమూరి హీరోతో సినిమా చేయనున్నాడట హరీష్ శంకర్. ప్రస్తుతం హరీష్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు కంప్లీట్ అయినా వెంటనే బాలకృష్ణ ప్రాజెక్టు మొదలుపెట్టనున్నాడట హరీష్. ఇక బాలయ్య కూడా బేబీ సినిమా అయ్యాక వెంటనే అఖండ 2 కాకుండా హరీష్ శంకర్ సినిమాను స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. త్వరలోనే ఈ  క్రేజీ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి మెగా హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హరీష్ బాలకృష్ణకు ఎలాంటి సినిమాను సెట్ చేస్తాడా చూడాలి.