సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలో దూసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన చిన్న కుమార్తె తేజస్విని సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సాధారణంగా కెమెరా వెనుక కాస్త రిజర్వ్ డ్ గా ఉండే ఈమె.. లేటెస్ట్ గా డ్యాన్స్ ఫ్లోర్ పై వేసిన స్టెప్పులకు ఇంటర్నెట్ ఊగిపోతోంది. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాను మాస్టర్ తో కలిసి ఆమె చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.
సాధారణంగా నందమూరి ఫ్యామిలీలోని మహిళలు గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటారు. కానీ, తేజస్విని ఆ గీతలను దాటి తనలోని అల్టిమేట్ ఎనర్జీని బయటకు తీశారు. ప్రొఫెషనల్ డ్యాన్సర్‌కు ఏమాత్రం తీసిపోని గ్రేస్, అదిరిపోయే టైమింగ్‌తో ఆమె స్టెప్స్ వేశారు. ఈ వీడియో చూసిని ఫ్యాన్స్ 'అచ్చం నాన్న పోలికే, బాలయ్య బాబు మాస్ ఎనర్జీ వంద శాతం వచ్చింది' అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి తేజస్విని కేవలం డ్యాన్స్‌తోనే కాదు, మల్టీ-టాలెంట్‌తోనూ సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఆహా ఓటీటీలో రికార్డులు సృష్టించిన బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' టాక్ షో గ్రాండ్ సక్సెస్ వెనుక తేజస్విని నిర్మాణ పర్యవేక్షణ, ప్లానింగ్ ఉన్నాయన్నది ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం తండ్రి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ ఆమె వర్క్ చేశారు. వైజాగ్ ఎంపీ, గీతం (GITAM) విద్యాసంస్థల ప్రెసిడెంట్ మతుకుమిల్లి శ్రీభరత్‌ను వివాహం చేసుకున్న తేజస్విని.. ఒకవైపు ఫ్యామిలీని, భర్త వ్యాపారాలను చూసుకుంటూనే, మరోవైపు తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు.
ఇటీవలే 'సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్' బ్రాండ్ అంబాసిడర్‌గా మారి రాయల్ లుక్‌లో మెరిసింది తేజస్విని. ఇప్పుడు ఈ క్రేజీ డ్యాన్స్ వీడియోతో ఒక్కసారిగా నెటిజన్లను ఫిదా చేసేశారు. స్క్రీన్ ప్రెజెన్స్‌లో నందమూరి బ్లడ్ పవర్ ఏంటో చూపిస్తూ, తన సైలెంట్ మోడ్‌ను కాస్త వైలెంట్ మాస్ మోడ్‌లోకి తేజస్విని మారంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Once in a while, dance your heart out! @sribharatm pic.twitter.com/pIOTzzcVsR
— Tejeswini Nandamuri Mathukumilli (@Tejeswini_M) May 29, 2026
