సమాజానికి అవసరమైన బ్రీత్

సమాజానికి అవసరమైన బ్రీత్

నందమూరి చైతన్య కృష్ణ హీరోగా తన తండ్రి జయకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ట్యాగ్ లైన్.  వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకుడు.  వైదిక సెంజలియా హీరోయిన్‌‌గా, వెన్నెల కిషోర్, భద్రమ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం  డిసెంబర్ 2న విడుదల కానుంది.  ఈ సందర్భంగా  నిర్వహించిన ప్రీ రిలీజ్‌‌ ఈవెంట్‌‌లో నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొని సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.  చైతన్య కృష్ణ మాట్లాడుతూ ‘దర్శకుడు వంశీకృష్ణ  చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. 

మంచి సందేశంతో సమాజానికి అవసరమైన కథ ఇది. ఇందులో  దాదాపు చాలా మంది కొత్త నటీనటులు ఉన్నా అందరూ బాగా పెర్ఫార్మ్ చేశారు. టెక్నికల్‌‌గా కూడా బెస్ట్ అవుట్‌‌పుట్ వచ్చింది.  తప్పకుండా ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది’ అని  చెప్పాడు.  ఇదొక వండర్‌‌‌‌ఫుల్ జర్నీ అని, ఈ చిత్రంలో పార్ట్ అవడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది హీరోయిన్ వైదిక. దర్శకుడు వంశీకృష్ణ మాట్లాడుతూ ‘చైతన్య కృష్ణ ఈ సినిమాతో  వెర్సటైల్ హీరోగా ప్రూవ్ అవుతారు. 

చాలా సందర్భాల్లో  బాలయ్య బాబునే  డైరెక్ట్ చేస్తున్న ఫీలింగ్ కలిగింది‘ అని చెప్పాడు. ‘ఇదొక ఎమోషనల్ థ్రిల్లర్ అని, ప్రేక్షకులు తప్పకుండా  ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పారు నిర్మాత జయకృష్ణ. నందమూరి రామకృష్ణ, మోహన్ కృష్ణ, లోకేశ్వరి, మాధవి మణి, మోహన రూపతో పాటు మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.