
‘హాయ్ నాన్న’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నాని.. తాజాగా మరో కొత్త సినిమాకు సైన్ చేశాడు. వివేక్ ఆత్రేయ తెరకెక్కించబోయే ఈ చిత్రాన్ని శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో నాని ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు. తన కెరీర్‌లో ఇది 31వ చిత్రం. ఇందులో హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్ మోహన్‌ను ఫిక్స్ చేశారు. దీంతో ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో ఆకట్టుకున్న నాని, ప్రియాంక జోడీ మరోసారి రిపీట్ అవుతోంది. అలాగే 'అంటే సుందరానికీ' తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటిస్తున్న చిత్రమిది. డీవీవీ దానయ్య, దాసరి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 24న పూజా కార్యక్రమాలతో ప్రారంభించ నున్నారు. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలో రివీల్ చేస్తామని తెలియజేశారు.