
బలగం(Balagam) సినిమాతో అనూహ్య విజయాన్ని అందుకున్నాడు జబర్దస్త్ వేణు(Jabardasth Venu). ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్నాడు. దాంతో జబర్దస్త్ వేణు కాస్త బలగం వేణు(Balagam Venu)గా మారిపోయాడు.
వేణు తన తరువాతి సినిమా కోసం నేచురల్ స్టార్ నాని (Nani)ని సెలెక్ట్ చేసుకున్నాడట. ఈ కాంబోని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సెట్ చేశారట. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కు సంబందించిన కథ చర్చలు పూర్తవగా..ఫైనల్ నేరేషన్ కూడా కంప్లీట్ అయినట్లు సమాచారం.
లేటెస్ట్గా ఈ సినిమాకు..తెలంగాణ మనుషులలో బాగా పాపులర్ అయిన పేరునే టైటిల్గా ఎంచుకున్నట్లు సమాచారం. 'ఎల్లమ్మ'(Ellamma) అనే టైటిల్ని వేణు బృందం అంత పరిశీలిస్తున్నట్లు తెలిసింది. దాదాపు ఆ టైటిల్ కన్పమ్ చేయడానికి ఎక్కువగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.
కథని ఆధారంగా చేసుకుని డైరెక్టర్ వేణు ఆ టైటిల్ సెలెక్ట్ చేయడంతో నాని..దిల్ రాజు కూడా సానుకూలంగానే ఉన్నారని తెలుస్తోంది. దిల్ రాజు, నాని ఈ సినిమాకు సంబంధించి వేణు విజన్కి పెద్ద పీట వేస్తూ..తనకి పూర్తిగా స్వేచ్ఛని కల్పించినట్లు తెలుస్తోంది.
ఎల్లమ్మ అనే పేరుతో..తెలుగు నేటివిటీని కళ్ళకు కట్టినట్లు చూపించాలని వేణు ఫిక్స్ అయ్యాడట. తెలంగాణలో మహిళలకు ఇలాంటి పేరు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎల్లమ్మ గ్రామ దేవతగా పిలుస్తుంటారు. అలాంటిది నాని సినిమాకి ఎల్లమ్మ టైటిల్‌గా పెట్టడం మరింత ఆసక్తికరంగా మారింది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం టైటిల్కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అంతేకాకుండా ఈ సినిమాలో తెలంగాణ పల్లెటూరిలో జరిగే ఓ పీరియాడికల్ లవ్ స్టోరీని తనదైన శైలిలో వేణు కథని సిద్ధం చేసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదివరకే నాని శ్యామ్ సింగరాయ్తో పీరియాడిక్ కాన్సెప్ట్ టచ్ చేశాడు. ఇక బలగం వేణు..నానితో కొత్తగా తెలంగాణ లవ్ స్టోరీతో తనదైన పాత కాలానికి..ప్రేమలు హత్తుకునే సామ్రాజ్యానికి తీసుకెళ్తున్నాడట. ప్రస్తుతం ఈ కాంబోపై ఇండస్ట్రీలో మంచి టాక్ ఉంది. త్వరలో ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇటీవలే నాని హాయ్ నాన్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం మూవీలో నటిస్తున్నాడు.