మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichandar).. సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తూ మంచి ఫామ్లో ఉన్నాడు. తన ఎలక్ట్రిఫయింగ్ మ్యూజిక్తో మ్యాజిక్ చేస్తూ.. ఆడియన్స్ను మెస్మరైజ్ చేస్తున్నాడు. మనిషి చూడటానికి సన్నగా ఉంటాడు కానీ.. మ్యూజిక్ ఇస్తే స్పీకర్లు పగిలిపోవడం ఖాయం. అలాంటి సెన్సేషనల్ అనిరుధ్.. లేటెస్ట్గా హైదరాబాద్‌లో నిర్వహించిన లైవ్ కాన్సర్ట్‌తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాడు.
శనివారం (మార్చి 21) రాత్రి నిర్వహించిన ఈ మ్యూజికల్ ఈవెంట్ దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగి సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రారంభం నుంచి ముగింపు వరకు గచ్చిబౌలి స్టేడియం హై ఎనర్జీతో నిండిపోయింది.
ఈ మ్యూజికల్ ఈవెంట్లో అనిరుధ్ తన హిట్ తెలుగు, తమిళ పాటలను లైవ్‌గా పర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఉత్సాహభరితంగా మలిచాడు. స్టేడియంలో అభిమానులతో పాటలు పాడిస్తూ, డాన్స్ చేయిస్తూ పూర్తి ఎంజాయ్ చేశారు.
దళపతి విజయ్ నటించిన జన నాయగన్ లోని ‘నా రెడీ’, ది ప్యారడైస్ లోని “ఆయా షేర్”, కింగ్డమ్ లోని “రగిలే రగిలే” వంటి పాటలను లైవ్‌గా పర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించాడు. సింగర్ జోనిత గాంధీ “నువ్వు కావాలయ్యా” వంటి పాటకు కూడా భారీ స్పందన వచ్చింది.
‘జడల్’ సాంగ్ హైలైట్
ఈ మ్యూజికల్ కాన్సర్ట్‌లో ‘జడల్’ సాంగ్ అతిపెద్ద హైలైట్‌గా నిలిచింది. నాని నటిస్తున్న ది ప్యారడైస్ సినిమాలోని ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ సాంగ్ సోషల్ మీడియాలో చార్ట్‌బస్టర్‌గా ట్రెండ్ అవుతుండగా, లైవ్‌లో మరింత క్రేజ్ సంపాదించింది.
AAYA SHERRR FULL VERSION🦁🔥🔥@NameisNani vibingg🥵🥵💥🤌🏻#AnirudhXV #AnirudhConcert pic.twitter.com/LLVaFhJB97
— AvgGuy (@AvgGuy__) March 21, 2026
ఈ ఈవెంట్‌కు నాని తన ఫ్యామిలీతో కలిసి అటెండ్ అయ్యాడు. ‘జడల్’ పాట సమయంలో ప్రేక్షకులతో కలిసి నాని ఎంజాయ్ చేయడం మరింత స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. అదేవిధంగా, మహేష్ బాబు కుమార్తె సితార కూడా ఈ ఈవెంట్‌కు హాజరైంది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొనడంతో ఈ కాన్సర్ట్ మరింత గ్రాండ్‌గా నిలిచింది.
Bakkathala singing #AayaSher and Nani–Odela vibing to it
— Nanii!! (@narasimha_chow2) March 21, 2026
Oh God, we were already witnessing #TheParadise event vibes 😭😭😭🔥@NameisNani @anirudhofficial @odela_srikanth #TheParadise #AnirudhConceet #AnirudXV pic.twitter.com/8zuWunxb8s
ప్యారడైస్పై పెరిగిన అంచనాలు..
అనిరుధ్ లైవ్ కాన్సర్ట్ హైదరాబాద్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా ‘జడల్’ సాంగ్‌కు వచ్చిన స్పందన, టాలీవుడ్‌లో ఆ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. ఈ ఈవెంట్‌తో అనిరుధ్ మరోసారి తన లైవ్ పర్ఫార్మెన్స్ మ్యాజిక్‌ను నిరూపించాడు.
భారీ డిమాండ్ – రికార్డు హాజరు
అనిరుధ్ లైవ్ కాన్సర్ట్ కు టికెట్ల కోసం 1.5 లక్షల మంది ఆసక్తి చూపించారు. అయితే, స్టేడియం సామర్థ్యం: సుమారు 30,000వేలు మాత్రమే. ఇక దాదాపు 50వేల మంది అటెండ్ అవ్వడంతో కొంచెం ఇబ్బంది ఏర్పడింది. అయినప్పటికీ ఈవెంట్ ఎలాంటి అంతరాయం లేకుండా సక్సెస్ అయింది.
పోలీసులు భారీగా మోహరించడంతో పాటు సెక్యూరిటీ, క్రౌడ్ మేనేజ్‌మెంట్ అద్భుతంగా నిర్వహించారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో జరిగిన అతిపెద్ద మ్యూజికల్ కాన్సర్ట్‌గా అనిరుధ్ షో నిలిచింది.
Eelaa vuntey 15K yenti 25K ayina pettochuu🔥🔥🔥🔥#Anirudh #AnirudhConcert pic.twitter.com/QnDmoORWcF
— Siva Kurapati (@Sivakurapati626) March 21, 2026
