నాని ‘గ్యాంగ్‌ లీడర్ టీజర్‌ వచ్చేసింది..

నాని ‘గ్యాంగ్‌ లీడర్ టీజర్‌ వచ్చేసింది..

విక్రమ్‌ కుమార్‌ డైరెక్షన్ లో నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న సినిమా ‘గ్యాంగ్‌ లీడర్’. నాని సరసన ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న  ఈ సినిమా టీజర్‌ రిలీజైంది. బుధవారం నాని ట్విటర్‌ వేదికగా టీజర్ విడుదల చేస్తూ.. ‘నా గ్యాంగ్, విక్రమ్‌ కథ, అనిరుధ్‌ సౌండ్‌, మైత్రి డబ్బు, మన సినిమా, మీ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు.

‘నా పేరు పెన్సిల్‌. ఫేమస్‌ రివెంజ్‌ రైటర్‌’ అంటూ నాని చెబుతున్న డైలాగ్‌ తో టీజర్‌ మొదలైంది. ఒంటరిగా ఉంటున్న నాని వద్దకు ఓ చిన్నారితో కలిసి నలుగురు ఆడవాళ్లు వస్తారు. వారంతా నాని సాయంతో తమ పగ తీర్చుకుంటూ ఉంటారు. టీజర్‌ చివర్లో నాని స్టైల్‌ గా కళ్లజోడు పెట్టుకుని ‘మీరూ పెట్టుకోండి’ అని తన గ్యాంగ్‌ ను అడుగుతాడు. ఇందుకు వారు ‘మేం తీసుకురాలేదు. ఇంట్లోనే పెట్టేశాం’ అని చెప్పడం నవ్వులు పూయిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.