హాయ్ నాన్న మూవీ నుంచి.. ఫస్ట్ సింగిల్ రిలీజ్

హాయ్ నాన్న మూవీ నుంచి.. ఫస్ట్ సింగిల్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని(Nani) తను ఎంచుకునే కథల విషయంలో ఎప్పటికప్పుడు ప్రత్యేకత చాటుతూ ఉంటారు. అలా ప్రతి మూవీలను ఒక ఎమోషన్ క్యారీ చేస్తూ.. అందరినీ తన నటనతో ఆకట్టుకుంటారు. లేటెస్ట్ గా  నాని30వ మూవీ హాయ్ నాన్న(Hi Nanna) నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్.

సమయమా..భలే సాయం చేసావమ్మా ఒట్టుగా..కనులకే తన రూపాన్ని అందించావు గుట్టుగా..అంటూ శ్రావ్యంగా సాగిన ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. అనురాగ్ కులకర్ణి..సితార కృష్ణకుమార్ పాడారు. ఈ సాంగ్ విని  కొద్ది.. మళ్లీ వినాలి అనే ఫ్రెష్ ఫీలింగ్  కలిగిస్తోంది. లిరికల్ వీడియోలో నాని, మృణాల్(Mrunalthakur)  జోడీ ఆకట్టుకుంటోంది.హేషామ్ అబ్దుల్ వహాబ్(Heshamabdulwahab) స్వరపరిచిన ఈ పాటతో..హాయ్ నాన్న సాంగ్స్ ఎలా ఉండబోతాయనే విషయం అర్ధమవుతోంది.

రీసెంట్గా హేషామ్ అబ్దుల్ అందించిన ఖుషి మూవీ సాంగ్స్కు  ఆడియన్స్ నుంచి కేజ్రీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక హాయ్ నాన్నతో మరో హిట్ ఆల్బమ్ ఇవ్వడం కన్ఫమ్ అంటున్నారు ఆడియన్స్. హాయ్ నాన్న నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్, గ్లింప్స్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని  శౌర్యువ్ అనే కొత్త ద‌ర్శ‌కుడి తెరకెక్కిస్తున్నారు.

కాగా హాయ్ నాన్న మూవీ వైరా ఎంట‌ర్ టైన్‌మెంట్స్(Vyraentertainments) బ్యాన‌ర్‌పై మోహ‌న్ చెరుకూరి, విజ‌యేంద‌ర్‌రెడ్డి తీగ‌ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల ఎమోష‌న‌ల్ జ‌ర్నీ నేప‌థ్యంలో వస్తోన్న ఈ మూవీ..తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.