జెర్సీ ట్రైలర్ : నా జీవితాన్ని మళ్లీ మొదలుపెడతా..!

జెర్సీ ట్రైలర్ : నా జీవితాన్ని మళ్లీ మొదలుపెడతా..!

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా జెర్సీ. నాని సరసన శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా నటించిన  ఈ మూవీ..ఈ నెల 19న రిలీజ్ కానుండగా.. ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది యూనిట్. ఈ క్రమంలోనే శుక్రవారం జెర్సీ ట్రైలర్ రిలీజ్ చేశారు.

నాని అర్జున్ పాత్ర‌లో అద‌ర‌గొట్టాడు. కొన్ని సీన్స్ సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. పదేళ్ల క్రితం ఆగిపోయిన నా జీవితాన్ని మళ్లీ మొదలుపెడతా..’ అంటూ నాని చెబుతున్న డైలాగ్‌ ట్రైలర్‌ లో హైలైట్‌ గా నిలిచింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 15న నిర్వహించి, సినిమాపై మ‌రింత హైప్ తేవాల‌ని ప్లాన్ చేస్తుంది యూనిట్. జెర్సీ సినిమాను సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. అనిరుధ్ మ్యూజిక్.