
తమిళ పరిశ్రమలో ఎంతో కాలంగా సినిమాలు చేస్తున్నా ప్రియాంక అరుల్మోహన్(Priyanka Arul Mohan)కు సరైన గుర్తింపు దక్కలేదు. ఓజీ(OG) మూవీలో ఈ బ్యూటీని అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపును తనవైపుకు తిప్పుకుంది. ఇప్పుడు టాలీవుడ్లో బిజీ బిజీగా మారింది.
లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ నటికి మరో క్రేజీ ఆఫర్ తలుపుతట్టినట్టు తెలుస్తోంది. న్యాచురల్ స్టార్ నాని(Nani)తో రెండో సారి నటించే ఆఫర్ అందుకుందని సమాచారం. అది కూడా వివేక్ఆత్రేయ(Vivek Athreya) వంటి యంగ్డైరెక్టర్ సినిమాలో అని తెలుస్తోంది. నానితో కలిసి గతంలో గ్యాంగ్లీడర్లో ఈ బ్యూటీ నటించింది. ఇప్పుడు నాని తన 31 మూవీని వివేక్తో ప్లాన్ చేశాడు. ఇప్పటికే వీరి కాంబోలో అంటే సుందరానికి వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ మూవీలో హీరోయిన్ రోల్ కోసం ప్రియాంకను సంప్రదించారనే టాక్ నడుస్తోంది. ఇందులో హీరోయిన్ పాత్రకి కూడా చాలా వెయిట్ ఉంటుందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఓజీ, నాని 31 సినిమాలతో హిట్ కొడితే..ప్రియాంక ఇండస్ట్రీ టాక్ అఫ్ ది టౌన్ గా మారటం కన్ఫర్మ్. ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్ దళపతి 68 లో నటిస్తుంది.
Also Read :- 4 రోజులు కనిపించకుంటే విడాకులు ఇప్పిస్తారా?
ప్రస్తుతం నాని హాయ్ నాన్న(Hi Nanna) మూవీ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్నా ఈ సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal thakur) హీరోయిన్ గా నటిస్తుండగా..శౌర్యువ్(Shouryuv) దర్శకత్వం వహిస్తున్నారు. దసరా(Dasara) వంటి బ్లాక్ బస్టర్ తరువాత నాని నుండి వస్తున్న సినిమా కావడంతో..హాయ్ నాన్న పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆసక్తిని పెంచుతున్నాయి.