రెబల్ స్టార్ ప్రభాస్ తో'సాహో', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'ఓజీ' వంటి చిత్రాలతో సుజీత్ ఎలాంటి యాక్షన్ మ్యాజిక్ క్రియేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి రాబోతున్న మరో మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ 'బ్లడీ రోమియో' (Bloody Romeo). నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాను నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇటీవల 'ది ప్యారడైజ్' మూవీ కోసం గడ్డం, పొడవాటి జుట్టుతో రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించిన నాని, ఇప్పుడు 'బ్లడీ రోమియో' కోసం అల్ట్రా స్టైలిష్‌గా మేకోవర్ అయ్యారు. బ్లాక్ గాగుల్స్, నీట్ హెయిర్ కట్‌తో క్లాసీగా రూపాంతరం చెందిన నాని కొత్త లుక్ విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. "Bloody Romeo.. The Kitchen Opens Soon" అంటూ ఫుడ్ ట్రక్‌పై రాసి ఉన్న ప్రత్యేక వీడియోను చిత్రబృందం పంచుకుంది. నాని కూడా ఎక్స్ (X) వేదికగా దీనిని షేర్ చేయడంతో ఆన్ లైన్ లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దసరా కానుకగా ఈ అల్ట్రా మోడ్రన్ లుక్‌ను అధికారికంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో నాని ఒక గ్యాంగ్‌స్టర్ నుంచి చెఫ్‌గా మారే విభిన్నమైన, చమత్కారమైన పాత్రలో కనిపించబోతున్నారని ఇన్‌సైడ్ టాక్. ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్, వైలెన్స్ ఉన్నప్పటికీ చాలా స్టైలిష్‌గా, యూనిక్‌గా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో నాని వెల్లడించారు. కథానుగుణంగా లండన్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కీలక షెడ్యూల్ కోసం నాని అక్టోబర్ నుంచే డేట్స్ కేటాయించినట్లు సమాచారం.
తెలుగులోనే కాకుండా ఏ భాషలోనూ ఇప్పటివరకు చూడని వినూత్నమైన ట్రీట్‌మెంట్‌తో సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. థియేటర్లలో ప్రేక్షకులకు ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని నాని ధీమా వ్యక్తం చేశారు. దీంతో ఈ డిఫరెంట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.
Inka Raccha Raccheee…. 💥💥💥 #BloodyRomeo @NameisNani @Sujeethsign https://t.co/dLkhLR0bMe
— Bloody Romeo (@BloodyRomeoFilm) October 10, 2026
